వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరుకు చెందిన తాజ్, వరాల రాజు గురువారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. కాగ శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో తుఫాన్ వాహనం కారు ఢీకొన్న ప్రమాదంలో గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి మృతి చెందగా, ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి అని తెలిపారు.