నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ పరిధిలోని జూరాల ప్రాజెక్టుకు భారీ వరద చేరడంతో సోమవారం అధికారులు 32 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 1, 60, 000 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1, 57, 718 క్యూసెక్కులు కొనసా గుతుందని తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9. 650 ప్రస్తుతం నీటి నిల్వ 7. 371 టిఎంసిలు ఉందని అధికారులు తెలిపారు