మహిళలు స్వశక్తితో స్వయం ఉపాధి పొందవచ్చని ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్ అన్నారు. గురువారం ఉట్కూరు మండలం పెద్ద జట్రం రైతు వేదికలో షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ సంయుక్త ఆధ్వర్యంలో స్వయం ఉపాధిపై మహిళలకు మూడు నెలల ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని న్యాక్ డైరెక్టర్ రాజిరెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.