ఉట్కూర్: ఎత్తిపోతల పనులకు సహకరించాలి

63చూసినవారు
ఉట్కూర్: ఎత్తిపోతల పనులకు సహకరించాలి
నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి అందరూ సహకరించాలని జిల్లా జల సాధన సమితి కో కన్వీనర్ నరసింహ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. సాగు నీటి కొరకు జిల్లాలోని రైతులు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని అఖిలపక్ష నాయకులు, రైతులు, రైతు సంఘాలు సహకరించాలని చెప్పారు. ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని, అన్ని విధాలుగా ఆదుకోవాలని, నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్