రాబోయే రోజుల్లో ప్రతి చెరువును నింపుతాం

75చూసినవారు
రాబోయే రోజుల్లో ప్రతి చెరువును నింపుతాం
రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో ఉన్న ప్రతి చెరువును నింపేందుకు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా భూత్పూర్ రిజర్వాయర్ నుండి గురువారం అమరచింత పిన్నంచర్ల గ్రామం చెరువులకు ఎమ్మెల్యే నీటిని విడుదల చేశారు. అనంతరం ఆయా గ్రామాల చెరువులను పరిశీలించారు. ప్రస్తుతం ఎండల తీవ్రత కారణంగా సాగునీటి ఎద్దడిని అరికట్టేందుకే చెరువులకు నీటిని విడుదల చేస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్