నర్వ: విలేకరుల సమస్యలపై పోరాటం చేస్తాం
నారాయణపేట జిల్లా కేంద్రంలో ఈనెల 27న జరిగే టీయుడబ్ల్యుజే జిల్లా ప్రథమ మహాసభలను విజయవంతం చేయాలని యూనియన్ జిల్లా కన్వీనర్ నారాయణరెడ్డి అన్నారు. బుధవారం నర్వ మండల కేంద్రంలో స్థానిక విలేకరులతో సమావేశం నిర్వహించారు. జిల్లా మహాసభలకు పెద్ద ఎత్తున విలేకరులు తరలి రావాలని అన్నారు. విలేకరుల సమస్యలపై పోరాటం చేస్తామని, చిరకాల కోరికగా మిగిలిన ఇల్ల స్థలాలు, హెల్త్ కార్డులను సాధిస్తామని చెప్పారు.