నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం వట్టెం దగ్గర పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోని వెంకటాద్రి రిజర్వాయర్ ముంపు గ్రామాల ప్రజలకు నిర్మించిన ఆర్ అండ్ ఆర్ కాలనీని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఇటీవలి కురిసిన భారీ వర్షాలకు మట్టి గుట్ట కూలడాన్ని కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణాలను వెంటనే పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.