లింగాల మండలం చెన్నంపల్లిలో ఇండ్ల మధ్య రోడ్డుకు ఆనుకొని ఉన్న ఓ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తో ప్రమాదం పొంచి ఉంది. ఎప్పుడు ఏ ప్రమాదం సంభ విస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె కాని ఎలాంటి రక్షణ వలయం కాని ఏర్పాటు చేయలేదు. ట్రాన్స్ కో అధికారులు దృష్టిసారించి చుట్టూ కంచె లాంటి రక్షణ వలయం ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.