కొల్లాపూర్ లో వేరుశనగ మార్కెట్ ను ఏర్పాటు చేయాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాలపిర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రం తహశీల్దారుకు అందజేశారు. కొల్లాపూర్ మార్కెట్లో వేరుశనగ మార్కెట్ ను ప్రారంభించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.