సీఎం మాచారం పర్యటన ఈ నెల 19వ తేదీకి వాయిదా

80చూసినవారు
సీఎం మాచారం పర్యటన ఈ నెల 19వ తేదీకి వాయిదా
సీఎం రేవంత్‌ రెడ్డి నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం మాచారం పర్యటన ఈ నెల 19వ తేదీకి వాయిదా పడింది. ఇందిర సౌరగిరి జల వికాసం పథకానికి మాచారం గ్రామాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం ఇందిర సౌర గిరిజన వికాస పథకాన్ని ఆ రోజు మాచారంలో ప్రారంభించనున్నారు.  మే 18న ఈ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించగా పలు కారణాలతో ఆ కార్యక్రమంలో మే 19కి వాయిదా పడింది.

సంబంధిత పోస్ట్