వంగూరు మండలం సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లి గ్రామానికి 19న చేరుకుంటారు. గ్రామంలో సీఎం సొంత ఖర్చులు 3 కోట్లతో నిర్మించిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి ఆలయంలోప్రత్యేక పూజలు నిర్వహిస్తారని అడిషనల్ కలెక్టర్ అమరేందర్ తెలిపారు. సీఎం రాక తో శనివారం కొండారెడ్డిపల్లి గ్రామంలోని గ్రామపంచాయతీలో అన్ని శాఖల అధికారులతో అడిషనల్ కలెక్టర్ సమీక్ష సమావేశంనిర్వహించారు. హెలిపాడ్ స్థలాన్ని పరిశీలించారు.