నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఈ నెల 18 తేదీన సీఎం రేవంత్ రెడ్డి పర్యటించానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. సౌరగిరి జలవికాసం పథకం ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారని ఎమ్మెల్యే వంశీకృష్ణ శుక్రవారం తెలిపారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా అమ్రాబాద్ కు రానున్న నేపథ్యంలో 30, 000 మందితో బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నారన్నారు.