చారకొండ మండల కేంద్రంలో జాతీయ రహదారి 167 రోడ్డుకు అడ్డంగా ఉన్న ఇండ్లను జేసీబీలతో నేలమట్టం చేయడంతో పేదలంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నారని బాధితులకు వెంటనే నూతన ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు డిమాండ్ చేశారు. గురువారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తహశీల్దార్ సునీతకు బాధితుల పక్షాన వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.