ప్రజల సహకారంతోనే శాంతి భద్రతలు సాధ్యం: ఐజీ

76చూసినవారు
ప్రజల సహకారంతోనే శాంతి భద్రతలు సాధ్యం: ఐజీ
ప్రజల సహకారంతోనే శాంతి భద్రతలు సాధ్యమని మల్టీ జోన్ ఐజీ సత్యనారాయణ అన్నారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ పోలీస్ స్టేషన్ ను ఐజీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి నేరాలు, రోడ్డు ప్రమాదాల గురించి అడిగి తెలుసుకొన్నారు. గంజాయి, పీడీఎస్ బియ్యం రవాణా అరికట్టాలని సూచించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్