నాగర్ కర్నూలు జిల్లాలోని మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న పంచాయతీ ఆపరేటర్లు వేతనాలు విడుదల చేయాలని జిల్లా పంచాయతీ అధికారికి వినతి పత్రాలు శుక్రవారం సమర్పించారు. గత ఆరు నెలలుగా జీతాలు లేక కుటుంబ పోషణ భారంగా మారి ఆర్థికంగా సతమతం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నిధులు విడుదల చెయ్యాలని వినతి పత్రాన్ని అందజేశారు.