నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం దగ్గర అగ్రికల్చర్ వ్యవసాయ కేంద్రం మెయిన్ రోడ్డుపై బైక్ పై వస్తున్న వ్యక్తి కల్వర్ట్ ఢీకొని గుంతలో పడ్డాడు. రోడ్డుపై వస్తున్న వాహనదారులు ఆగి అతని బయటకు తీశారు. 108 అంబులెన్స్ కు సమాచారం తెలిపి నాగర్ కర్నూల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అతను గుడ్ల నర్వ గ్రామానికి చెందిన వ్యక్తిగా మండలి వెంకటస్వామిగా గుర్తించారు.