ఆశ వర్కర్ల పై రాజకీయ వేధింపులు ఆపాలి: సిఐటియు

74చూసినవారు
ఆశ వర్కర్ల పై రాజకీయ వేధింపులు ఆపాలి: సిఐటియు
గ్రామాలలో ఆశ వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో డిఎంహెచ్వో సుధాకర్ లాల్ కు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం మారిన తర్వాత గ్రామాలలో ఆశ వర్కర్లపై రాజకీయ వేధింపులు పెరిగాయని, దానితో ఆశ వర్కర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.