నాగర్ కర్నూల్ జిల్లా గ్రంథాలయ భవనానికి ప్రముఖ కవి శతాధిక గ్రంథకర్త కీ. శే. కపిలవాయి లింగమూర్తి పేరు పెట్టాలని ఎక్సైజ్ సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావుకు కవులు వినతిపత్రం సమర్పించారు. వెన్నెల సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ లోని మంత్రి చాంబర్ లో మంత్రిని కలిశారు. గ్రంథాలయానికి కపిలవాయి పేరు పెట్టేలా కృషి చేస్తానని తెలిపారు.