రాష్ట్ర ప్రభుత్వం నూతన రేట్ల పెంపు జీవో విడుదల చేసి, పెంచిన రేట్లను అమలు చేసి వారికి న్యాయం చేయాలని సీపీఎం మండల కార్యదర్శి పొదిల రామయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నాగర్ కర్నూల్ స్టాక్ పాయింట్ వద్ద సమ్మె చేస్తున్న సివిల్ సప్లై హమాలి కార్మికుల నిరవధిక సమ్మె శిబిరాన్ని సందర్శించారు. ప్రభుత్వం తక్షణమే కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్నారు.