నాగర్ కర్నూల్: పదో తరగతి పరీక్ష రుసుము గడువులోగా చెల్లించాలి
పదో తరగతి పరీక్ష రుసుం చెల్లింపు తేదీలను ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు వెల్లడించిన వివరాల ప్రకారం పరీక్షల రుసుము చెల్లింపుల విషయంలో హెచ్ఎం ప్రత్యేక శ్రద్ద వహించాలని నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖాధికారి గోవిందరాజులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 18 వరకు చెల్లించకునేందుకు గడువు ఇచ్చారని తెలిపారు. రూ. 50 ఆలస్య రుసుముతో డిసెంబరు 2వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించారన్నారు