నారాయణపేట పట్టణంలోని ఆదర్శ పాఠశాలలో చదువుకున్న పదవ తరగతి 2001-02 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఓ ఫంక్షన్ హాలులో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో గడిపిన తీపి జ్ఞాపకాలను, మధుర స్మృతులను నెమరేసుకున్నారు. పాఠాలు బోధించిన ఉపాధ్యాయులను పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి, రాఘవేందర్ చారి, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.