సీజనల్ వ్యాధులపై అవగాహన

66చూసినవారు
సీజనల్ వ్యాధులపై అవగాహన
వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు నారాయణపేట ఆర్టీసీ బస్టాండ్, సింగారం, జలాల్ పూర్ గ్రామాలలో అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, నీటిని వేడి చేసి చల్లార్చి వడపోసిన నీటిని త్రాగాలని అన్నారు. నీటిని ఎక్కువ రోజులు నిల్వ చేయరాదని అన్నారు. కళాకారులు రవిశంకర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్