బాలల హక్కులు, చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ అన్నారు. శనివారం నారాయణపేట కోర్టు మీటింగ్ హాలులో చైల్డ్ ఫ్రెండ్లి లీగల్ సర్వీసెస్ కమిటీ సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అంశాలను వివరించారు. బాలల చట్టాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు అనే విషయాలను క్లుప్తంగా వివరించారు. విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆమె కోరారు.