తల్లిపాలు అమృతంతో సమానం

54చూసినవారు
తల్లిపాలు అమృతంతో సమానం
తల్లిపాలు అమృతంతో సమానమని జిల్లా వైద్య శాఖ అధికారిణి సౌభాగ్యలక్ష్మి అన్నారు. నారాయణపేట జిల్లా ఆసుపత్రిలో గురువారం తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం గర్భిణీ మహిళలకు, బాలింతలకు తల్లి పాల ప్రాముఖ్యతను వివరించారు. బిడ్డ పుట్టిన గంట లోపు కచ్చితంగా తల్లిపాలు ఇవ్వాలని, ముర్రు పాలలో తగిన పోషకాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు వుంటాయని చెప్పారు. సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్