సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం నారాయణపేట మున్సిపల్ పార్క్ వద్ద సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పును పాలకులు అపహస్యం చేస్తున్నారని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేయాలన్నారు.