ధన్వాడ మండలం పాతపల్లి వాగును బుధవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును విద్యార్థులు దాటడం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు పిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాలు పడుతున్న సమయంలో తల్లిదండ్రులు తమ విద్యార్థులను పాఠశాలకు పంపకూడదని అన్నారు.