నారాయణపేట కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ శ్రీహర్ష ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. వరుస ఎన్నికల కోడ్ కారణంగా మూడు నెలల తరువాత ప్రజావాణి ప్రారంభం కావడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు కలెక్టరేట్ కు తరలి వచ్చారు. అధికారులు పాల్గొన్నారు.