నారాయణపేట వ్యవసాయ మార్కెట్ యార్డు దడవాయి సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నూతన కార్యదర్శి రమేష్ తెలిపారు. అధ్యక్షుడిగా వెంకటేష్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ లను ఎన్నుకున్నట్లు తెలిపారు. దడవాయిల సమస్యలు పరిష్కారానికి నూతన కమిటీ కృషి చేస్తుందని అన్నారు. కమిషన్ పెంచేలా అధికారులు, వ్యాపారస్తుల చర్చలు జరుపుతామని పేర్కొన్నారు. ధాన్యం తీసుకొచ్చిన రైతులకు తమ వంతుగా సేవలు అందిస్తామని చెప్పారు.