దామరగిద్ద: డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభించిన నేతలు

60చూసినవారు
దామరగిద్ద: డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభించిన నేతలు
గ్రామాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి అన్నారు. శనివారం దామరగిద్ద మండలం మల్ రెడ్డి పల్లి గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే చిట్టెం పర్ణికరెడ్డీ, ప్రజల సహకారంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాల్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్