దామరగిద్ద మండలం కంసాన్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించే చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ స్థాపనకు గురువారం నారాయణపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమి పూజలు నిర్వహించారు. గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ స్థాపనకు ముందుకు వచ్చిన నిర్వాహకులను చైర్మన్ అభినందించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ పాలన అద్భుతమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.