దామరగిద్ద: కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే

70చూసినవారు
దామరగిద్ద: కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే
ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి రేపు (గురువారం) దామరగిద్ద మండల కేంద్రంలో పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాల్ రెడ్డి తెలిపారు. ఉదయం 9: 30 గంటలకు రైతు వేదికలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులు పంపిణీ చేస్తారని చెప్పారు. కార్యక్రమానికి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్