దామరగిద్ద మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందులు కొనుగోలు కేంద్రాన్ని బుధవారం నారాయణపేట మార్కెట్ ఛైర్మెన్ శివారెడ్డి ప్రారంభించారు. రైతులు పండించిన కందులను ప్రభుత్వం క్వింటాలుకు రూ. 7, 550 మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుందని అన్నారు. కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.