దామరగిద్ధ: షి టీమ్ పై విద్యార్థులకు అవగాహన

64చూసినవారు
దామరగిద్ధ: షి టీమ్ పై విద్యార్థులకు అవగాహన
అపరిచిత వ్యక్తుల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని షి టీమ్ పోలీసులు బాలరాజు చెన్నయ్య అన్నారు. మంగళవారం దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షి టీమ్ పై అవగాహన కల్పించారు. ఆకతాయిల నుండి వేధింపులకు గురైతే షి టీమ్ పోలీసులను నేరుగా లేదా 8712670398 నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ర్యాగింగ్ ఈవ్ టీజింగ్ చేయడం చట్టరీత్యా నేరమని అన్నారు.

సంబంధిత పోస్ట్