ఈనెల 7 నుండి 9 వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రం డేహ్రాడూన్ లో జరిగే జాతీయ నెట్ బాల్ పోటీలకు రాష్ట్ర పురుషుల జట్టుకు దన్వాడ మండలం కొండాపూర్ గిరిజన గురుకులంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఆర్ గణేష్ ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ రాజారాం, కోచ్, ఫిజికల్ డైరెక్టర్ రామ్మోహన్ గౌడ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గణేష్ నెట్ బాల్ క్రీడలో మూడు సార్లు జాతీయస్థాయి పోటీలలో పాల్గొని ప్రతిభ కనబరిచారని చెప్పారు.