నారాయణపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆదివారం సాయంత్రం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. వాహనాలపై వెళ్తున్న వారిని నిలిపి బ్రీత్ అనలైజర్ తో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. శిక్షణ ఎస్సై గాయత్రి మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని సూచించారు. మద్యం సేవించిన కేసులు పునరావృతం అయితే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.