కొత్తగా 11 మండలాలు ఏర్పాటు చేస్తున్నట్లు క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కోయిలకొండ మండలం గార్లపాడు గ్రామాన్ని నూతన మండలంగా ప్రకటించాలని మండల సాధన సమితి జెఏసి కో కన్వీనర్ వెంకట్రామిరెడ్డి అన్నారు. మండలం ఏర్పాటు చేయాలని చేపట్టిన దీక్షలు ఆదివారం కొనసాగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్ద మండలంగా వున్న కోయిలకొండ మండలాన్ని రెండుగా విభజించి నూతన మండలం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.