నారాయణపేట: రైతు భరోసాలో కోత విధించడం సరైంది కాదు

66చూసినవారు
నారాయణపేట: రైతు భరోసాలో కోత విధించడం సరైంది కాదు
రైతులు పంట సాగు చేసుకునేందుకు ప్రభుత్వం అందించే పంట పెట్టుబడి సహాయం రైతు భరోసాలో కోత విధించడం సరైంది కాదని అఖిల భారత ఐక్య రైతు సంఘం నారాయణపేట జిల్లా కార్యదర్శి యాదగిరి ఆదివారం ఒక ప్రకటనలో అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతు భరోసా పథకం కింద రూ. 15 వేలు అందిస్తామని హామీ ఇచ్చి కేవలం రూ. 12 వేలు అందిస్తామని ప్రకటించడం సమంజసం కాదని, రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్