మహిళల పట్ల కేటీఆర్ వ్యాఖ్యలు సరైనవి కాదు: ఎమ్మెల్యే

50చూసినవారు
మహిళల పట్ల మాజీ మంత్రి కేటీఆర్ చులకనగా మాట్లాడడం సరైనది కాదని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి శుక్రవారం సోషల్ మీడియా వేదికగా వీడియోను విడుదల చేశారు. 6 గ్యారంటీలలో భాగంగా ప్రవేశపెట్టిన మహిళల ఉచిత బస్సు పథకాన్ని కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇకపై మహిళల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్