నారాయణపేట: రైతు డిమాండ్ డే ను జయప్రదం చేయండి

82చూసినవారు
నారాయణపేట: రైతు డిమాండ్ డే ను జయప్రదం చేయండి
ఈనెల 9న ఇండియా డిమాండ్ డేగా జరపాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం జాతీయ కమిటీ పిలుపులో భాగంగా ఆదివారం నారాయణపేట మండలం కోటకొండ భగత్ సింగ్ చౌరస్తాలో సంఘం నాయకులు వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు హాజీ మలాంగ్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా రైతులు పండించిన పంటలకు స్వామినాథన్ సిఫారసులు అమలు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని అన్నారు.

సంబంధిత పోస్ట్