మరికల్: దుకాణాలకు టెండర్లు వేయాలి

71చూసినవారు
మరికల్: దుకాణాలకు టెండర్లు వేయాలి
మరికల్ గ్రామ పంచాయతీ దుకాణాల సముదాయాలకు టెండర్లు వేయాలని మంగళవారం అఖిలపక్షం నాయకులు ఎంపిడివో కొండన్నను కోరారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఓటరు జాబితా అభ్యంతరాలపై నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఏళ్ల నుండి దుకాణాలకు సంబంధించి అద్దెలు చెల్లించడం లేదని, టెండర్లు పిలిచి కొత్త వ్యక్తులకు ఇవ్వాలని కోరారు. అద్దె వసూలు కాకపోవడంతో ప్రభుత్వం ఆదాయం కోల్పోతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్