నారాయణపేట: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

51చూసినవారు
రాష్ట్ర సరిహద్దు నారాయణపేట మండలం ఏక్లాస్ పూర్ గ్రామ శివారులో కర్ణాటక ఆర్టీసీ బస్ జీపు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు మహిళలు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం జీపులో నారాయణపేటకు వస్తుండగా బస్సు ఢీకొనడంతో నారాయణపేటకు చెందిన శిరీష (10), కర్ణాటకకు చెందిన హనుమంతీ (50) స్పాట్లో మృతి చెందారు. నలుగురికి గాయాలు కాగా, అందులో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్