నారాయణపేట పట్టణంలోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం రెడ్ రిబ్బన్ క్లబ్, ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించినట్లు ప్రిన్సిపల్ మెర్సీ వసంత తెలిపారు. ఈ సందర్భంగా స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సభ్యురాలు భవాని మాట్లాడుతూ.. ఎచ్ ఐ వి వ్యాధి వున్న వారితో సెక్స్ లో పాల్గొనడం ద్వారా ఎయిడ్స్ వ్యాధి సోకుతుందని అన్నారు.