బాల కార్మిక చట్టాన్ని బలోపేతం చేసి బాల కార్మికులు లేని జిల్లాగా చేయాలని ఆర్డీవో రామచందర్ నాయక్ అన్నారు. మంగళవారం నారాయణపేట ఆర్డీవో కార్యాలయంలో జిల్లా సంక్షేమ అధికారిణి జయ, ఐజేఎం స్వచ్ఛంద సంస్థ సభ్యులతో సమావేశం నిర్వహించారు. బాల కార్మికులను పనిలో పెట్టుకునే వారిపై చర్యలు చేపట్టేలా చూడాలని అన్నారు. బాల కార్మికులను పనిలో పెట్టే కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని ఆర్డీవో అన్నారు.