నారాయణపేట పట్టణంలో మంగళవారం జరిగిన నాలుగు లక్షల అపహరణ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తం అయ్యాయి. దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామానికి చెందిన నారాయణ యూనియన్ బ్యాంకు నుండి రూ. 4 లక్షల డ్రా చేసుకొని ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా బేకరి వద్ద నిలిపి బ్రెడ్లు తీసుకునేందుకు వెళ్లాడు. గమనించిన దుండగుడు డబ్బులు ఉన్న సంచిని అపహరించుకొని అక్కడి నుండి పరారయ్యాడు. దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.