మోసాలకు పాల్పడే గొలుసుకట్టు వ్యాపారాలకు ప్రజలు దూరంగా ఉండాలని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ శుక్రవారం ప్రకటనలో హెచ్చరించారు. ప్రజల సొమ్ము దోచుకోవడానికి సైబర్ కేటుగాళ్లు కొత్త కొత్త పోకడలతో ప్రజల బలహీనతను పెట్టుబడిగా చేసుకునేందుకు కొత్త పంథాను ప్రయోగిస్తున్నారని అన్నారు. తక్కువ ధరకు విలాసవంతమైన వస్తువులు ఇస్తామంటూ చెప్పే మోసపూరిత మాటలు నమ్మకూడదని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.