నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ప్రగతి సాధించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం నారాయణపేట కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. జయచంద్ర మోహన్ రాబోయే వర్షాకాలంలో రోగాలు రాకుండా తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఇంటి పరిసరాలను శుభ్రంగా పెట్టాలని కలెక్టర్ అన్నారు.