నారాయణపేట: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

61చూసినవారు
నారాయణపేట: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఏఎస్సై ఆంజనేయులు అన్నారు. బుధవారం నారాయణపేట పట్టణంలోని నర్సిరెడ్డి కూడలిలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మొత్తం 11 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడితే జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంటుందని అన్నారు.

సంబంధిత పోస్ట్