నారాయణపేట: భార్య మృతికి కారణమైన భర్తకు జైలు శిక్ష

76చూసినవారు
నారాయణపేట: భార్య మృతికి కారణమైన భర్తకు జైలు శిక్ష
భార్య మృతికి కారణమైన కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లాకు చెందిన మహేష్ కుమార్ కు పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 25 జరిమానా విధిస్తూ మంగళవారం న్యాయమూర్తి అబ్దుల్ రఫీ తీర్పు వెల్లడించారని ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. అదనపు కట్నం కొరకు వేదించడంతో మే 31 2023 నారాయణపేట మండలం సింగారం గ్రామానికి చెందిన భవాని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అన్న భరత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్