మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ లలితాబాయి నామాజీ సేవలు చిరస్మరణీయమని బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, రాష్ట్ర బీజేపీ నాయకులు రతంగ్ పాండురెడ్డి అన్నారు. నారాయణపేట పట్టణంలో శనివారం లలిత బాయి 18వ వర్ధంతిని పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ గా ఆమె చేసిన అభివృద్ధి పనులు, సేవలను కొనియాడారు. నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.