పదవ తరగతి వార్షిక పరీక్ష ఫలితాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ట్రైనీ కలెక్టర్ గరిమా నరుల అన్నారు. ఎస్సీ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థులకు ప్రేరణ తరగతుల నిర్వహణలో భాగంగా బుధవారం నారాయణపేట స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ లో నిర్వహించిన శిక్షణా శిబిరానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మార్చిలో జరగనున్న వార్షిక పరీక్షలలో విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని అన్నారు.